ఉత్తానపాద మహారాజు ఒడిలో కూర్చున్న చిన్న ధ్రువుడు — సవతి తల్లి రెండు మాటలు అతడిని దించేశాయి.సురుచి అంది: ఈ ఒడి కావాలంటే నా కడుపున పుట్టు. తండ్రి మౌనంగా ఉన్నాడు. ఏడుస్తూ బాలుడు తల్లి సునీతి దగ్గరకు వచ్చాడు.తల్లి అంది: ఎవరూ లాక్కోలేని ఒడి భగవంతుడిది. ధ్రువుడు అడవికి వెళ్లి, నారదుడి నుంచి మంత్రం పొంది, తపస్సులో నిలిచాడు.ఆరు నెలల్లో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడికి కదలని స్థానం — ధ్రువ నక్షత్రం, అన్నీ దాని చుట్టూ తిరుగుతాయి.